Wednesday, 7 August 2024

join us

  

 



 

zee telugu sarigamapa auditions

 

గాయనీగాయకులకు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 16: ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్​.. మనవరంగల్​, కరీంనగర్​లో!

హైదరాబాద్​,06ఆగస్ట్​ 2024:తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్​ జీ తెలుగు. ఫిక్షన్​, నాన్-ఫిక్షన్​ షోతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో​ వినోదం అందించడంతోపాటు​ ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సరిగమప నిర్వహించిన 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ​విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు ‘సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్​ యూత్​ ఐకాన్​’​ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్​ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది.

జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్​ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ శని, ఆదివారాల్లో మన వరంగల్​, కరీంనగర్​​లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది. 15-30 సంవత్సరాల వయస్సుగల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు.

సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. వరంగల్​లోఆగస్టు 10న ఆల్ఫోర్స్​​ జూనియర్కాలేజ్​, నయీమ్​ నగర్​, హన్మకొండ, ఆగస్టు 11న కరీంనగర్​లోని ఆల్ఫోర్స్​ ఇ-టెక్నో స్కూల్​, కొత్తపల్లిలో ఆడిషన్స్​ జరగనున్నాయి. వివరాల కోసం 9154670067నెంబర్​పైసంప్రదించవచ్చు. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్​ ఛాన్స్​ని మిస్​ కావద్దు!

అంతేకాదు ఔత్సాహికులు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. పాట పాడిన తమ వీడియోలను 9154670067నెంబర్​కి వాట్సాప్లేదా ztsaregamapa@zee.comఇమెయిల్ ద్వారా పంపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం జీ తెలుగు ‘సరిగమప సీజన్​ 16 ది నెక్ట్స్​ సింగింగ్​ యూత్​ ఐకాన్’ టైటిల్​ కోసం మీరూ పోటీలో పాల్గొనండి!

 

మీలోని ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని వేదిక..జీ తెలుగు సరిగమప సీజన్​ 16- ది నెక్ట్స్​ సింగింగ్​ యూత్​ ఐకాన్.. ఆడిషన్స్​లో వెంటనే పాల్గొనండి!

 


 

 

Anant Ambani Appointed Executive Director at RIL, to Earn Up to ₹20 Crore Annually

Anant Ambani Appointed Executive Director of Reliance Industries Mumbai, June 30, 2025 – In a key leadership development, Anant Ambani h...